నే సావాలంటే
Translated to Telugu by @abhignarigalaనే సావాలంటే
నూ బతకాల
నా కథ చెప్పాల
నా సామాన్లమ్మి
ఓ తెల్లని గుడ్డ, కొన్ని దారాలు కొనాల
(ఆ గుడ్డకో పొడవాటి తోక)
ఘాజాలో యేమూలనో ఓ బిడ్డ
నింగి కంట్లోకి చూస్తా ఉంటాడు
గప్పున మండి
ఎవ్వరికీ చెప్పక
ఎప్పట్లా "ఉంటా" అనికూడా అనక
పోయిన వాని నాయన కొరకు
ఆ ఎగిరే పతంగిని చూసి
అదే, నూ చేసిన నా పతంగి -ఆ గుండెకు ఓ కనమైనా తట్టనీ
ప్రేమను జల్లే దేవతోటుందని
నే సచ్చే తీరాలంటే
నా సావు ఆశని కననీ
అదో కథవనీ